Naga Manikanta: హౌస్ లో ఎవరు ఏంటో చెప్పేసిన నాగ మణికంఠ!
on Oct 21, 2024
బిగ్ బాస్ ఇంట్లోంచి ఏడో వారం నాగ మణికంఠ(Naga Manikanta) బయటకు వచ్చేయాల్సి వచ్చింది. ఈ వారం అంతా కూడా మణికంఠ సరిగ్గా ఆడలేదు. ఇక్కడ ఉండలేకపోతోన్నాను.. బయటకు వెళ్తాను.. నన్ను పంపించేయండి.. నాకు ఓట్లు వేయకండి.. దండం పెడతానంటూ మాట్లాడేశాడు. దీంతో మణికంఠ చివరకు ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. ఆడియెన్స్ అతడ్ని సేవ్ చేసినా కూడా బయటకు వెళ్లిపోయాడు.
నేను బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చినప్పుడు ఎవ్వరికీ తెలియదు.. ఆడియన్స్ సపోర్ట్ ఇక్కడి వరకు వచ్చాను.. నా వల్ల కావడం లేదని బయటకు వెళ్తున్నా.. లవ్యూ ఫరెవర్ అంటూ ఆడియెన్స్‌కు థాంక్స్ చెప్పి వెళ్లిపోయాడు మణికంఠ. ఇప్పటి వరకు ఇంటి నుంచి బేబక్క, శేఖర్ బాషా, అభయ్, ఆదిత్య, నైనిక, సోనియా, సీతలు ఆడియెన్స్ ఓట్ల ద్వారా బయటకు వెళ్లారు. కానీ ఈసారి మణికంఠ తన మాత్రం సొంత నిర్ణయంతో బయటకు వెళ్లిపోయాడు. ఇక స్టేజ్ మీదకి వచ్చిన మణికంఠ బాబు హౌస్ లో ఎవరు ఏంటో చెప్పుకొచ్చాడు.
నయని పావని ఎమోషనల్ పర్సన్. నాలో ఉన్న చాలా లక్షణాలు ఆమెలోను ఉన్నాయి. ఎదుటివారిని బాగా అర్థం చేసుకుంటుందని మణికంఠ చెప్పాడు. విష్ణుప్రియ నీళ్ళలాగా స్వచ్ఛమైనది. తనకేం చేయాలనిపిస్తే అది చేస్తుంది. నబీల్ ప్రతీ ఇంట్లో ఉండే ఒక సగటు అబ్బాయిలా ఉంటాడు. ఎక్కడ ఎలా మాట్లాడాలి? ఎంత మాట్లాడాలి? ఎలా ఆడాలన్న తెలివి ఉన్న అబ్బాయి అని మణికంఠ చెప్పాడు. మెహబూబ్ చాలా సైలెంట్ గా ఉన్నాడు. విజేతకు ఉండాల్సిన లక్షణాల్లో ఇది ఒక్కటి. హౌస్ ని హ్యాండిల్ చేసే పద్దతి బాగుంది. ఇంకా చాలా ఉందంటూ మణికంఠ అన్నాడు. ఇక అవినాష్, రోహిణి, హరితేజ హౌస్ కి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారంటు మణికంఠ బాబు అన్నాడు. టేస్టీ తేజ ఎనర్జీ కనపడటం లేదని చెప్పాడు. నిఖిల్ మొదటి వారాల్లో ఎనర్జీ ఇప్పుడు లేదు.. టాప్-5 ఉంటావని ఆశిస్తున్నానంటు మణికంఠ చెప్పాడు. పృథ్వీ మంచి గేమర్ చిన్న చిన్న పొరపాట్లని పక్కన పెడితే ముందుకెళ్తావని చెప్పాడు. గౌతమ్ ఇప్పుడే ఆట మొదలైంది. అవసరమైనప్పుడే మాట్లాడు. ప్రేరణ అవసరం లేని చోట కూడా తన పాయింట్ చెప్పాలనుకుంటుంది. నీ ఆట నువ్వు ఆడుకుంటే బాగుంటుందని మణికంఠ అన్నాడు. ఇలా బిగ్ బాస్(Biggboss 8 Telugu) హౌస్ లో ఎవరు ఏంటో నాగ మణికంఠ(Naga Manikanta) చెప్పుకొచ్చాడు.